అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
మొసలిని చూస్తేనే మామూలుగా బెంబేలెత్తిపోతారు. అలాంటిది మన కళ్ల ముందే ప్రత్యక్షమైతే ఇంకెలా ఉంటుంది. గుండెలు జారిపోవు. నదిలో సేదదీరాల్సిన మొసలి ఒకటి.. జనారణ్యంలోకి వచ్చేసింది.
ఉత్తరాఖండ్‌ను మరోసారి వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కురవడంతో హరిద్వార్‌లో పెద్ద ఎత్తున ప్రవాహం ప్రవహించింది. దీంతో కార్లు, బస్సులు కొట్టుకుపోయాయి. శ్మశాన వాటికలో ఆగి ఉన్న బస్సులు, ఎనిమిది కార్లు కొట్టుకుపోయాయి.
ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షం కురిసింది. భద్రాచలంలో రామాలయం వద్ద ఉన్న అన్నదానం సత్రం చుట్టూ నీళ్లు చేరుకున్నాయి. రామాలయం వద్ద నీళ్లు చేరి అంతా చెరువులా మారింది .
సిక్కింలోని మంగన్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు గురువారం తెలిపారు. మరోవైపు.. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి.. ఇళ్లు దెబ్బతిన్నాయి, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే.. భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగన్ జిల్లాలోని పక్షేప్ ప్రాంతంలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. రంగ్‌రాంగ్ సమీపంలో ముగ్గురు, పక్షేప్ నుండి ఇద్దరు మిస్సింగ్ అయినట్లు అధికారులు…
సిక్కింలో భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అలాగే కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది.
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.
Telangana Rains: హైదరాబాద్ నగరమంతటా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చాలా చోట్ల వర్షం మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Hyderabad People: వర్షం వస్తే చాలు భయపడాల్సి వస్తుందని, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని మాదాపూర్ వాసులు, స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.