భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక చెన్నైలో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.
రాగస తుఫాన్ హాంకాంగ్, దక్షిణ చైనా, తైవాన్, ఫిలిప్పీన్స్‌లో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు 200 కి.మీ వేగంతో గాలులు వీచడంతో ప్రధాన పట్టణాలన్నీ అతలాకుతలం అయ్యాయి. తుఫాన్ కారణంగా తైవాన్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్‌లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి.…
ఒక్క భారీ వర్షం గురుగ్రామ్‌ను అతలాకుతలం చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. ఇక సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే ఉద్యోగులంతా నరకయాతన అనుభవించారు.
దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.
జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోయింది.