దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్‌లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rain Alert: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్‌లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Hussain Sagar: నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ లో నీటిమట్టం పెరిగింది. ఎఫ్డిఎల్ లెవెల్ 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం వరకు 513.60 మీటర్లకు ..
Water Supply: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నగరం నీటమునిగింది. దీంతో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు (మంగళవారం) ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంట వ్యవధిలోనే ఆకాశం మబ్బు పట్టింది..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆయా చోట్ల సాయంత్రం 4గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాకుండా సాయంత్రం సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది.