Heavy Rain In Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) తెల్లవారు జామున ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరపిలేకుండ వాన పడుతుంది. ముంబైలోని పలు ప్రాంతాల్లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ముంబై, థానే, పాల్ఘర్, కొంకణ్ బెల్ట్ లకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా ముంబైలోని విద్యా సంస్థలకు అధికారులు హాలీడేస్ ప్రకటించారు. థానేలో నీట మునిగి రిసార్ట్ నుంచి 49 మందిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రక్షించాయి. పాల్ఘర్ లో వరదలో చిక్కుకున్న 26 మందిని గ్రామస్థులు సేవ్ చేశారు.
Read Also: Pakistan: 15 రోజుల శిశువును బ్రతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి..!
ఇక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులపై తీవ్రం చూపిస్తుంది. నేటి ఉదయం రైల్వే స్టేషన్లు, ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో.. కొన్ని గంటల పాటు రైళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. డోంబివిలి స్టేషన్‌లో రైల్వే ట్రాక్ లపై నీరు చేరింది. అట్‌గావ్, థాన్‌సిత్ స్టేషన్‌ల మధ్య ట్రాక్ పూర్తిగా దెబ్బతినడంతో.. కసర, టిట్వాలా స్టేషన్ల మధ్య ట్రైన్ సేవలను నిలిపివేశారు. అత్యంత రద్దీగా ఉండే కల్యాణ్- కసర మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇకపోతే, ముంబైలో ఇవాళ అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేసింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని వెల్లడించారు.
#WATCH | Maharashtra: The traffic slows down on Western Express Highway near Vile Parle as heavy rain lashes Mumbai city. pic.twitter.com/aAzQaayTqO
— ANI (@ANI) July 8, 2024
#WATCH | Pedestrians and vehicles cross heavily waterlogged streets at King's Circle amid rains in Mumbai
A commuter says, "My car is stuck on the road. There is no point in blaming the government for the rains. The government is doing its job." pic.twitter.com/2v16Osb8NZ
— ANI (@ANI) July 8, 2024