Hangover Tips: మందు తాగే వారు చాలామంది ఉదయం పూట హ్యాంగోవర్ సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. రాత్రి సమయాలలో మందు తాగి పడుకొని లేచిన తర్వాత.. చాలామందికి తలపట్టేసినట్టుగా, కడుపులో వికారంగా ఉండేలా అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల ఉదయాన్నే వారి దినచర్యను కూడా సరిగా నిర్వహించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారికి కొన్ని చర్యల వల్ల వాటికి దూరంగా ఉండవచ్చు. మీ జీవితాన్ని సుఖంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం ఇలా…
కలోంజి గింజలు (నల్ల జీలకర్ర) అందరి ఇళ్లలో వంటగదిలో ఉంటాయి. ఇవి ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కలోంజి గింజల నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి గింజలు తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోవడంతో పాటు వ్యాధులు కూడా దూరమవుతాయి.
నాలుక రంగులో మార్పులు కూడా ఇన్ఫెక్షన్ లేదా అనేక రకాల తీవ్రమైన వ్యాధుల వంటి అంతర్లీన ఆరోగ్య సమస్యకు సంకేతమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నాలుక సాధారణంగా లేత ఎరుపు-గులాబీ రంగులో ఉంటుంది. అలా కాకుండా.. అసాధారణమైన మార్పు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది. మన నాలుక శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను సూచిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మధుమేహం తీవ్ర ఆరోగ్య సమస్యగా మారుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే చిన్నప్పటి నుండే దీని నివారణ గురించి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి.. జీవనశైలి, ఆహారం రెండూ చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు. ఇందులో డైట్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. మీరు తినేవి.. తిననివి మీ చక్కెర స్థాయిలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
ప్రస్తుతం మనం బతుకుతున్నది ఆధునిక యుగంలో... అన్ని పనులు త్వరగా పూర్తవ్వాలని ఆశిస్తుంటాం. ఆహారం విషయంలో కూడా అంతే.. అందుకే ఉదయం అల్పాహారంలో కష్టపడి వండుకునేందుకు బద్ధకంగా మారింది.
కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే మైనం లాంటి పదార్థం, ఇది శరీరం యొక్క అనేక రకాల పనితీరులో సహాయపడుతుంది. విటమిన్ డి, హార్మోన్ ఉత్పత్తికి అలాగే కణ త్వచాలు ఏర్పడటానికి కొలెస్ట్రాల్ చాలా ముఖ్యమైనది, అయితే రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు, ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ పరిస్థితిని అధిక కొలెస్ట్రాల్ అంటారు. భారతదేశ జనాభాలో దాదాపు 25 నుండి 30 శాతం మంది అధిక కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారు.
Women's Waist : వివాహం అనేది సామాజికంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా మార్పులను కలిగి ఉంటుంది. స్త్రీల జీవితంలో వచ్చే ఈ మార్పులు పాక్షికంగా శారీరకంగానూ, కొంతవరకు మానసికంగానూ ఉంటాయి.
ఇటీవల, యుపీలోని అమ్రోహాలో యుకేజీ చదువుతున్న 7 ఏళ్ల బాలికకు పాఠశాలలో గుండెపోటు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. మార్చిలో ఫిరోజాబాద్లోని పాఠశాలలో 8 ఏళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించింది.
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒత్తిడి సహజం. రోజూ ఆఫిసుల్లోనూ.. ఇంట్లోనూ పలు సందర్భాల్లో ఒత్తిడికి గురవుతుంటాం. ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం. శృతి మించితే ఒత్తిడి ప్రమాదమం.. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.