ఆరోగ్యంగా ఉండేందు కోసం సీజనల్ పండ్లు, కూరగాయలను తినడం చాలా ముఖ్యం. అందులో.. కాలీఫ్లవర్ ఒకటి, ఇది రుచికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. కాలీఫ్లవర్‌లో అనేక పోషకాలు, మొక్కల ఆధారిత సమ్మేళనాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు కనుగొన్నారు.
కాలీఫ్లవర్ చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీనిలో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ కె వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. అయితే కొంతమంది క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తినకూడదని మీకు తెలుసా..? దీంతో.. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కాలీఫ్లవర్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకునే ముందు దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
కాలీఫ్లవర్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 100 గ్రాముల కాలీఫ్లవర్‌లో 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మీ పొట్టలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పోషించి మంచి జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లు కనుగొన్నారు. అంతే కాకుండా.. కాలీఫ్లవర్ యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. ఇది మీ కణాలను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడంలో.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
India-Pak Trade Relations: ఈ ఒక్క అంశంలో భారత్ పాకిస్థాన్‌పై ఆధారపడుతోంది!
కోలిన్ రిచ్ వెజిటబుల్
కాలీఫ్లవర్‌లో కోలిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంది ప్రజలు తగినంత పరిమాణంలో తీసుకోరు. 100 గ్రాముల కాలీఫ్లవర్‌లో 44 mg కోలిన్ ఉంటుంది. ఇది మహిళలకు సిఫార్సు చేయబడిన 10%, పురుషులకు 8%. శరీరంలో కోలిన్ చాలా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. DNA ను సంశ్లేషణ చేయడంలో.. సరైన జీవక్రియను నిర్వహించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా.. మెదడు అభివృద్ధికి, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు కోలిన్ అవసరం.
ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కాలీఫ్లవర్ కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంది. థైరాయిడ్ ఉన్నవారు దీనిని తినొద్దని అధ్యయనాలు కనుగొన్నాయి. కాలీఫ్లవర్ T3, T4 హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకూడదు. కాలీఫ్లవర్‌లో ఉండే విటమిన్ ఎ, బి, సి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే దీనిని రోజూ తినడం వల్ల కొంతమందికి కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా.. పిత్తాశయం లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు కాలీఫ్లవర్ తినొద్దు. బాగా ఉడికించిన కాలీఫ్లవర్‌ని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. ఇది తిన్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి.. కాలీఫ్లవర్ ను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నవారు దూరంగా ఉంటే మంచిది. కాలీఫ్లవర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రాళ్ల సమస్యను పెంచుతుంది.