WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.…
WPL 2025: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. Read Also: America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం..…
AUS W vs IND W: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు, భారత మహిళల క్రికెట్ జట్టు మధ్య జరిగిన చివరిదైన మూడవ వన్డే మ్యాచ్ పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో మధ్య జరిగింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 83 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియాకు సారథ్యం వహించింది. ఇకపోతే, మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి…
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో చోటు దక్కించుకుంది. ఈ 'టీమ్ ఆఫ్ టోర్నీ'లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది.
Harmanpreet Kaur Captain For New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించినా.. సెలక్టర్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నమ్మకం ఉంచారు. కివీస్ వన్డే సిరీస్‌కు ఆమెకే బాధ్యతలను అప్పగించారు. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇక భారత జట్టులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ పేలవ ప్రదర్శన చేసింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండు మాత్రమే గెలిచి.. ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ చేసినా.. ఆమె నిదానంగా ఆడటం వల్లే ఓటమి ఎదురైందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో.. ఇప్పుడు ఆమె కెప్టెన్సీకే ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ‘టీ20…
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే…
శ్రీలంకపై విజయం మాత్రమే లక్ష్యంగా తాము బరిలోకి దిగలేదని, నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేలా ఆడాలనుకున్నాం అని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బ్యాటింగ్ చేయడంపై చర్చించుకున్నామని, కనీసం 7-8 రన్‌రేట్ కంటే ఎక్కువగా పరుగులు చేయాలని భావించామని చెప్పారు. శ్రీలంకపై భారీ మార్జిన్‌తో గెలినప్పుడే నెట్‌రన్‌రేట్ పెరిగే అవకాశం ఉంటుందని, అందుకే రన్‌రేట్‌పైనా దృష్టిపెట్టామని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చారు. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల…
Harmanpreet Kaur Injury: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన భారత్.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం అందుకుంది. కివీస్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న హర్మన్ సేన.. పాక్‌పై గెలుపుతో ఆశలను సజీవంగా ఉంచుకుంది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి సంచలన బౌలింగ్‌తో (3/19) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే భారత్ విజయానికి మరో రెండు పరుగులు కావాల్సిన సమయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్…
INDW vs PAKW T20 World Cup 2024 Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో తన ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్.. నేడు కీలక పోరుకు సిద్దమైంది. లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో హర్మన్‌ప్రీత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్ భారత్‌కు చావోరేవో. ఇకనుంచి ప్రతి మ్యాచూ కీలకం కాబట్టి పాకిస్థాన్‌పై నేడు గెలిచి తీరాల్సిందే. లేదంటే టోర్నీ ఆరంభ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇంత…