దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది. సెమీఫైనల్లో అలైస్సా హీలీ…
Team India: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత టీమిండియా విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టేసింది.
2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకోవాలనే పాకిస్తాన్ ఆశలు పూర్తిగా అడియాసలయ్యాయి. మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా చేతిలో 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. వర్ష ప్రభావితమైన ఈ మ్యాచ్‌లో పాక్ 20 ఓవర్లలో 234 పరుగులు చేయాల్సి ఉండగా.. ఏడు వికెట్లకు 83 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 312…
ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత్ కు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటింది. ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లోనే…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ కీలక మ్యాచ్‌లో టాస్ ప్రక్రియ వివాదంకు తెరలేపింది. మ్యాచ్‌లో టాస్ సందర్భంగా రిఫరీ సహా వ్యాఖ్యాత పెద్ద తప్పిదం చేశారు. తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ రిఫరీ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర ఉందని ఫాన్స్ మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి…
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇటీవల ముగిసిన పురుషుల ఆసియా కప్ 2025లో ‘నో హ్యాండ్‌షేక్’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగినా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్స్‌కు కరచాలనం ఇవ్వలేదు. అంతేకాదు ఆసియా కప్ గెలిచినా పీసీబీ చీఫ్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి టీమిండియా నిరాకరించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కూడా నో హ్యాండ్‌షేక్ కొనసాగుతోంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా కొలంబోలోని…