T20 World Cup 2024: భారత్ సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయిందిగా!
- ప్రపంచకప్‌లో టీమిండియాకు నిరాశే
- సెమీస్ చేరుతుందనుకుంటే సీన్ రివర్స్
- కనీస ప్రదర్శన ఇవ్వలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కథ ముగిసింది. న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలిస్తే.. సెమీస్ అవకాశాలు ఉంటాయని ఆశించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్ 54 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి నాకౌట్ చేరింది. ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో.. భారత్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. భారత జట్టు ఫామ్, ప్లేయర్స్‌ను చూస్తే కచ్చితంగా సెమీస్ చేరుతుందనుకుంటే.. సీన్ రివర్స్ అయింది.
టీ20 ప్రపంచకప్ కోసం బయల్దేరే ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు, తుది ఫలితంకు ఏ సంబంధం లేదు. టీ20ల్లో ఇదే భారత అత్యుత్తమ జట్టు అని, 12 మందికి ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉందని, వారి సత్తాపై నాకు బాగా నమ్మకముందన్న హర్మన్‌ప్రీత్ వ్యాఖ్యలు అందరిలో టైటిల్ ఆశలు రేపినా.. చివరకు నిరాశ పడక తప్పలేదు. గత మూడు ప్రపంచకప్‌లలో సెమీస్, ఫైనల్, సెమీస్ రికార్డు.. యూఏఈలో వాతావరణం, పిచ్‌లు భారత్‌కు అనుకూలం అంటూ జరిగిన ప్రచారం.. డబ్ల్యూపీఎల్‌లో మన ప్లేయర్స్ రాణించడం లాంటివి ఏమీ కలిసిరాలేదు.
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
Also Read: Monkey Viral Video: ‘మామ ఏక్ పెగ్ లా’ అంటూ.. బీరేసిన కోతి!
టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక్కతే రెండు అర్ధ సెంచరీలతో రాణించింది. టాప్-5లో మిగతా నలుగురు పూర్తిగా విఫలమయ్యారు. స్మృతి మంధాన మూడు కీలక మ్యాచ్‌లలో తేలిపోయింది. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కనీస ప్రదర్శన ఇవ్వలేదు. బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ పర్వాలేదనిపించింది. అరుంధతి రెడ్డి, రేణుక సింగ్ చెరో 7 వికెట్స్ తీశారు. ఆశా శోభన కూడా రాణించింది. సమష్టి వైఫల్యమే భారత్ కొంపముంచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ రెండు గెలిచి, రెండింటిలో ఓడింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!