India T20 Series Win: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు చివరి బంతికి ఓటమి పాలైంది. ఈ సిరీస్‌ను భారత్ 3-2తో గెలిచింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ విజయంతో ఇంగ్లండ్ గడ్డపై తొలిసారి రెండుకు పైగా మ్యాచ్‌లు ఉన్న టీ20 సిరీస్‌ను గెలిచి చరిత్రను సృష్టించింది. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఐదవ, చివరి టీ20 మ్యాచ్‌లో షెఫాలీ వర్మ సునామీ ఇన్నింగ్స్ ఆడినా, భారత…
IND vs ENG: శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత పురుషుల జట్టు ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నప్పుడే, మరోవైపు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ముంబయి నుంచి బయలుదేరిన మహిళల జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచులు ఆడనుంది. ఈ పర్యటన జూలై 28న మొదలవుతుంది. ఈ సిరీస్ భారత మహిళల జట్టుకు ఎంతో కీలకమైనది. ఎందుకంటే, సెప్టెంబర్‌లో జరగబోయే మహిళల వన్డే వరల్డ్‌కప్ ముందు, ఇంగ్లాండ్…
BCCI: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది. ఈసారి మొత్తం 16 మంది మహిళా ప్లేయర్స్ కు BCCI కాంట్రాక్ట్ ఇచ్చింది. మహిళా క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్లను గ్రేడ్ A లోకి, నలుగురుని గ్రేడ్ B లోకి, మిగిలిన 9 మందిని గ్రేడ్ C లోకి చేర్చారు. ఈ కాంట్రాక్ట్ 2024…
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో నేడు చివరి లీగ్ మ్యాచ్ జరగనుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో మంగళవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. బెంగళూరు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబైకి.. ఫైనల్ వెళ్లేందుకు మరో అవకాశం ఉంది. డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ఐపీఎల్ మాదిరిలా ఉండదన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో లీగ్…
డబ్ల్యూపీఎల్ 2025లో భాగంగా సోమవారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భార్తీ ఫుల్మాలీ (61; 25 బంతుల్లో 8×4, 4×6) హాఫ్ సెంచరీ చేయగా.. హర్లీన్ డియోల్ (24), లిచ్‌ఫీల్డ్ (22) పరుగులు చేశారు. ముంబై బౌలర్లు హేలీ, అమేలియా కెర్ చెరో మూడు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌కు ముందే ముంబై,…
WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.…
WPL 2025: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరితమైన పోరులో చివరి బంతికి విజయం సాధించింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో, అరుంధతి రెడ్డి చాకచక్యంగా ఆడుతూ రెండుపరుగులు పూర్తి చేసి ఢిల్లీకి విజయాన్ని అందించింది. దీంతో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. Read Also: America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం..…
AUS W vs IND W: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు, భారత మహిళల క్రికెట్ జట్టు మధ్య జరిగిన చివరిదైన మూడవ వన్డే మ్యాచ్ పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో మధ్య జరిగింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 83 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియాకు సారథ్యం వహించింది. ఇకపోతే, మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి…
భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్‌తో 2024 మహిళల టీ20 ప్రపంచ కప్ 'టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్'లో చోటు దక్కించుకుంది. ఈ 'టీమ్ ఆఫ్ టోర్నీ'లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలి మహిళల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ 20 వరల్డ్ కప్‌లో భారత్.. సెమీ-ఫైనల్‌కు చేరుకోపోయినప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది.
Harmanpreet Kaur Captain For New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించినా.. సెలక్టర్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై నమ్మకం ఉంచారు. కివీస్ వన్డే సిరీస్‌కు ఆమెకే బాధ్యతలను అప్పగించారు. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇక భారత జట్టులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు…