Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో…
Amol Muzumdar: టీమిండియా కల నిజమైన క్షణం అది.. చాలా కాలంగా కోట్లాది మంది స్నప్నాన్ని నిజం చేస్తూ మహిళల వన్డే ప్రపంచ కప్‌ను భారత మహిళా జట్టు ముద్దాడి క్షణం అది.. గెలిచిన తర్వాత ఆనందంతో కన్నీటి పర్యంతం అయిన భారత మహిళా జట్టు గురించి దేశం మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటుంది. కానీ ఇక్కడ ప్రపంచం, దేశం.. అందరూ తెలుసుకోవాల్సిన నిజమైన ఛాంపియన్ ఎవరో తెలుసా.. అమోల్ ముజుందార్. ఆయన తన కెరీర్లో…
2025 ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ విజయంతో భారత జట్టు తొలిసారిగా మహిళల ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు భారత్ 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేజింగ్‌లో ప్రొటీస్ 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2005, 2017 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.…
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా…
Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధరాత్రి చారిత్రాత్మక విజయాన్ని అందుకుని “అడ్డంకులను బద్దలు కొట్టాం… ఇది అంతం కాదు, కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొంది. ప్రపంచ కప్ గెలిచిన అద్భుత ఘట్టంలో ఆమె గతంలో ఎన్నడూ చూడని భావోద్వేగాల ప్రదర్శనను చూపింది. క్యాచ్ పట్టిన తర్వాత రేపంటూ లేనట్టుగా పిచ్చిగా పరిగెత్తింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ యువ క్రీడాకారులు సంబరాలు చేసుకుంటుండగా కాస్త దూరంగా నిలబడింది. అనంతరం తన “గురువు”…
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫైనల్ కి ముందు జరిగిన ప్రెస్ మీట్ లో ప్రొటీస్ కెప్టెన్ లారా మాట్లాడుతూ.. సొంత మైదానంలో ఆడడం వల్ల భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.. ఆ జట్టు గెలవాలని దేశం మొత్తం ఆశిస్తుంది పేర్కొనింది. కానీ ఇవి కేవలం అంచనాలు మాత్రమే.. వాళ్ల ఒత్తిడే మాకు అనుకూలంగా మారుతుందని తెలిపింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ బరిలోకి దూసుకెళ్లింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 3 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఓటమే ఎరుగని జట్టు ఆసీస్ ఒక్కటే. సెమీస్‌లోనూ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తాచాటుతున్న ఆసీస్.. అదే ఊపులో ఫైనల్ చేరాలని చూస్తోంది. మోస్తరు ప్రదర్శనతోనే సెమీస్ బెర్తు సాధించిన…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో కీలక సమరానికి వేళైంది. తొలి సెమీఫైనల్లో ఈరోజు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను భారత్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఓడించిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో మట్టికరిపించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్ సేనకు ఓ బ్యాడ్‌న్యూస్. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమైన ఆసీస్ స్టార్ అలైస్సా హీలీ సెమీఫైనల్లో రంగంలోకి దిగనుంది. సెమీఫైనల్లో అలైస్సా హీలీ…
Team India: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత టీమిండియా విజయం సాధించింది. 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టేసింది.