Namo Jersey: మహిళల ప్రపంచ కప్ 2025 గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులతో ఆయన ముచ్చటించారు. ప్రపంచ కప్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీ జట్టును అభినందించారు. ముఖ్యంగా మూడు వరుస ఓటముల తర్వాత టోర్నమెంట్‌లో జట్టు అద్భుతమైన కం బ్యాక్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్‌ను అధిగమించడంపై ఆయన ప్రశంసించారు.
ఈ సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. 2017లో మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత ప్రధానిని కలిసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ సమయంలో ఆయన మాకు ఎంతో మద్దతు అందించారని కౌర్ పేర్కొన్నారు. ఆ తర్వాత జట్టు వైస్-కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. ప్రధాని తమను బాగా ప్రోత్సహించారని, ఆయన తమందరికీ స్ఫూర్తి అని తెలిపింది. నేడు అన్ని రంగాలలో బాలికలు రాణిస్తున్నారని, ఈ పురోగతికి ప్రధాని మోదీనే కారణమని ఆమె కొనియాడారు. అలాగే టోర్నమెంట్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మాట్లాడుతూ.. ప్రధాని మోదీని కలవడానికి తాను ఎదురు చూశానని చెప్పారు. 2017లో ఆయన తమను కలుసుకుని, కష్టపడి పనిచేయడానికి ప్రోత్సహించిన విషయాన్ని ఆమె గుర్తు చేసింది. ఇక ఆ తర్వాత జట్టు సభ్యులందరూ తమ ఆటోగ్రాఫ్‌లు వేసిన ‘నమో’ అనే పేరుతో ఉన్న ప్రత్యేక జెర్సీని ప్రధానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ గా బహుకరించారు.
Kidney Stones: ఈ అలవాట్లు మార్చకోకపోతే మీ కిడ్నీలను మర్చిపోవాల్సిందే.. జాగ్రత్త గురూ..!
ప్రధాని మోదీతో ఆటగాళ్లతో చాలా సేపు ముచ్చటించారు. ఈ సమయంలో దీప్తి శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “జై శ్రీరామ్” అని రాసుకోవడం, అలాగే తన చేతిపై హనుమంతుడి పచ్చబొట్టు (టాటూ) గురించి ప్రధాని ప్రస్తావించారు. దీనితో ఆమె ఈ పచ్చబొట్టు తనకు బలాన్ని ఇస్తుందని చెప్పింది. అలాగే ప్రధాని ఎప్పుడూ వర్తమానంలో ఎలా ఉండగలుగుతారని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అడిగిన ప్రశ్నకు.. వర్తమానంలో ఉండటం తన జీవితంలో భాగమైపోయిందని, అది అలవాటుగా మారిందని ప్రధాని సమాధానం ఇచ్చారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత హర్మన్‌ప్రీత్ బంతిని జేబులో పెట్టుకోవడం గురించి కూడా ప్రధాని మాట్లాడారు. బంతి తన దగ్గరకు వచ్చినందుకు తాను అదృష్టవంతురాలినని, అందుకే దానిని దాచుకున్నానని ఆమె చెప్పారు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా సెంచూరియన్ లారా వోల్వార్డ్ట్‌ను అవుట్ చేయడానికి అమన్‌జోత్ కౌర్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ను కూడా ప్రధాని మోదీ ప్రశంసించారు. జట్టులోని మరో మరో క్రీడాకారిణి క్రాంతి గౌడ్ తన సోదరుడు ప్రధాని మోదీకి పెద్ద అభిమాని అని చెప్పగా.. వెంటనే వారిని కలవడానికి ఆహ్వానం అందించారు.
Viral Dance: ఎల్లమ్మ పాటకు పొట్టు పొట్టు ఎగిరిన వృద్ధురాలు.. షాకైన జనాలు..
ఇక దేశవ్యాప్తంగా ముఖ్యంగా బాలికల కోసం ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ భారత క్రికెట్ జట్టును కోరారు. పెరుగుతున్న ఊబకాయం (Obesity) సమస్య గురించి చర్చించి, ఫిట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో ఆయన నొక్కి చెప్పారు. అంతేకాకుండా వీలైనప్పుడు ఆటగాళ్లు పాఠశాలలను సందర్శించి, అక్కడి యువ విద్యార్థులకు స్ఫూర్తిని ఇవ్వాలని ఆయన ప్రోత్సహించారు.
