Women’s Team to Meet PM: ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత అమ్మాయిల క్రికెట్ జట్టు ఈరోజు ( నవంబర్ 5న) సాయంత్రం 6 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరగనున్న ఈ కార్యక్రమంలో జట్టు సభ్యులను మోడీ సన్మానించనున్నారు. ప్రధానితో సమావేశం తర్వాత ప్లేయర్లు అందరూ తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోనున్నారు. అయితే, భారత అమ్మాయిల జట్టు ముంబై నుంచి ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ లో మంగళవారం నాడు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంది. ప్రపంచ కప్ విజయం తరువాత జట్టు రాక నేపథ్యంలో రాజధానిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.
Read Also: High Court: భార్యను చిత్రహింసలు పెట్టిన 85 ఏళ్ల భర్తకు జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు
అయితే, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ‘ఉమెన్ ఇన్ బ్లూ’ తొలి ఐసీసీ ట్రోఫీని దక్కించుకుంది. భారత్ చారిత్రక విజయం సాధించిన వెంటనే ప్రధాని మోడీ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా అభినందించారు. “ఫైనల్స్‌లో భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది.. ఫైనల్‌లో వారి ప్రదర్శన గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో కూడిందన్నారు. ఈ టోర్నమెంట్ మొత్తం జట్టు అసాధారణమైన ప్రదర్శనలు చేసిందన్నారు. ఈ చారిత్రక విజయం భవిష్యత్తులో మరికొందరు అమ్మాయిలు క్రీడల వైపు మొగ్గు చూపేందుకు ప్రేరణగా నిలుస్తుందని #WomensWorldCup2025 అని ప్రధాని మోడీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.