Women’s World Cup Final: ఆటలో ఆధిపత్యం, పాటలో పరవశం – టీమిండియా విక్టరీ సాంగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s World Cup Final: నవీ ముంబైలో ఆదివారం భారతీయుల కలను టీమిండియా మహిళా జట్టు నిజం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ODI ప్రపంచ కప్‌ను ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ముద్దాడింది. అనంతరం నాలుగు సంవత్సరాల క్రితం రూపొందించిన జట్టు పాటను హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం మైదానంలో ఆవిష్కరించారు. ఆటగాళ్లు, జట్టు సహాయక సిబ్బంది, ఇతర సభ్యులు ఆనందోత్సాహాలతో పాటను హృదయపూర్వకంగా పాడారు. ఈ సందర్భంగా భారత సెమీఫైనల్ హీరో జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల క్రితం తాము ఒక ఈ పాటను రూపొందించామని అన్నారు. కానీ ప్రపంచ కప్ గెలిచిన రోజున దానిని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.
READ ALSO: Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్
Also Read
- Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
ఎదురు చూపులకు ముగింపు..
జెమిమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. “మేము ప్రపంచ కప్ గెలిచినప్పుడు మాత్రమే మా జట్టు పాటను వెల్లడిస్తామని దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాము. ఈ రాత్రి రాత్రి దానిని నిజం చేస్తున్నాం” అని రోడ్రిగ్స్ అన్నారు. ఆమె మాట్లాడిన అనంతరం టీమిండియా క్రికెటర్లు, జట్టు సహాయక సిబ్బంది పాటను పాడటం ప్రారంభించారు.
Team India, Team India,
Karde sabki hawa tight,
Team India is here to fight.
Koi na leta humko light,
Our future is bright.
Chand pe chalenge, sath me uthenge,
Hum hai Team India, hum sath me jitenge.
Na lega koi panga, kar denge hum danga.
Rahega sabse upar, humara tiranga.
Hum hai Team India, hum hai Team India, hum hai Team India.
ఈ టోర్నమెంట్‌లో భారతదేశం తరపున అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారిలో జెమిమా ఒకరు. ఏడు ఇన్నింగ్స్‌లలో 292 పరుగులు చేసి భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన మూడవ క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. ఆమె సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయంగా 127 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని ఛేదించింది. అది కూడా ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై కావడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసిన తర్వాత ఆమె సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ నంబర్.3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో షఫాలి వర్మ, దీప్తి శర్మ తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియా తరఫున అద్భుతంగా రాణించారు. షఫాలి 87, దీప్తి 58 పరుగులు చేయడంతో భారతదేశం 298/6 స్కోరు చేసింది. ఆ తర్వాత షఫాలి రెండు వికెట్లు, దీప్తి ఐదు వికెట్లు పడగొట్టింది దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసి 52 పరుగుల తేడాతో ప్రపంచ కప్‌ను గెలువడంలో కీలక పాత్ర పోషించారు.
READ ALSO: Pakistan: మునీర్ కోసం రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్ ప్రభుత్వం సన్నాహాలు..!
𝐒𝐭𝐫𝐚𝐢𝐠𝐡𝐭 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐡𝐞𝐚𝐫𝐭 💙
No better moment for the #WomenInBlue to unveil their team song. 🥳🎶#TeamIndia | #CWC25 | #Final | #INDvSA | #Champions pic.twitter.com/ah49KVTJTH
— BCCI Women (@BCCIWomen) November 3, 2025
తాజావార్తలు
-
Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500… రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
-
Land vs Flat: రాము రూ. పది లక్షలతో భూమి కొన్నాడు.. రవి అదే డబ్బుతో ఫ్లాట్ కొన్నాడు.. 20 ఏళ్ల తర్వాత ఎవరు ధనవంతులు?
-
‘జైలర్ 2’ సెన్సార్ రగడ. ‘U/A’ సర్టిఫికెట్ ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తానన్న రజనీకాంత్?
-
Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?