Harmanpreet Kaur Wax Statue: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2న భారత మహిళా క్రికెట్ జట్టు సృష్టించిన చరిత్రను ఎవరూ మర్చిపోలేరు. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాను ఓడించి హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో భారత జట్టు తమ మొట్టమొదటి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రక విజయాన్ని శాశ్వతం చేసేందుకు.. భారత జట్టుకు తొలి మహిళల వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని అందించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహాన్ని (Wax Statue) జైపూర్ నహర్‌గఢ్ కోటలో ఏర్పాటు చేయనున్నారు.
Health Benefits of Amla: ఉసిరి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా…
తాజాగా నాహర్‌గఢ్ కోటలోని శీష్ మహల్ లోపల ఉన్న జైపూర్ వాక్స్ మ్యూజియం ఈ విగ్రహ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 2026న హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం భారత్ సాధించిన చారిత్రక ప్రపంచ కప్ విజయానికి ఒక నివాళిగా, క్రీడల్లో మహిళా సాధికారతను ఉత్సవంలా జరుపుకోవడానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
మ్యూజియం వ్యవస్థాపకులు అనూప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం కేవలం ఒక ట్రోఫీ గెలిచిన జ్ఞాపకం కంటే ఎంతో ఎక్కువ అని అన్నారు. హర్మన్‌ప్రీత్ ధైర్యం, క్రమశిక్షణ, భారతీయ మహిళలు పెద్ద వేదికలపై నాయకత్వం వహించగలరనే విశ్వాసానికి ప్రతీకని అన్నారు. కేవలం ప్రముఖులను ప్రదర్శించడం కాకుండా.. సమాజంలో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తులను గౌరవించడమే మ్యూజియం లక్ష్యం అని ఆయన అన్నారు.
రూ.15,999కే 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో Moto G67 Power 5G లాంచ్..!
ఈ కొత్త మైనపు విగ్రహంతో మ్యూజియంలో భారతదేశ ఇద్దరు ప్రపంచ కప్ విజేత కెప్టెన్ల విగ్రహాలు ఉంటాయి. ఇదివరకు ఎంఎస్ ధోని ఉండగా.. ఇకపై హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఈ లిస్ట్ లో చేరనుంది. ఎంఎస్ ధోనితో పాటు, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ విగ్రహాలు కూడా మ్యూజియంలో ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్ విగ్రహం తయారీ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.