Harmanpreet Kaur: నవి ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమ్ ఇండియా 52 పరుగుల తేడాతో ప్రోటియాస్‌పై గెలిచి తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఈ విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. మొత్తం జట్టు సమన్వయంతో సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ విజయానంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆటగాళ్లను కలుసుకుని అభినందించిన సంగతి తెలిసిందే.
High Alert In Hyderabad: ఢిల్లీ పేలుడు ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో నాకా బందీ..!
అయితే ఈ సంబరాల మధ్య మాజీ భారత కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆమె మాట్లాడుతూ.. హర్మన్‌ప్రీత్ ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకుని బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి అని సూచించారు. జట్టు భవిష్యత్తు దృష్ట్యా మార్పులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లలో మిశ్రమ స్పందన కనపరిచింది. చాలా మంది రంగస్వామి వ్యాఖ్యలను విమర్శిస్తూ.. హర్మన్‌పై నమ్మకం ఉంచాలని కోరారు.
ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రంగస్వామి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ప్రతి వరల్డ్‌కప్ తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు వస్తుంటాయి. గత నాలుగు ఐదు వరల్డ్‌కప్పులను పరిశీలిస్తే ప్రతిసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారిని మీరు చూడవచ్చు. భారత్ ఓడినా, గెలిచినా హర్మన్‌ను తీసేయాలని మాట్లాడతారని అన్నారు. అలాగే, ఇప్పుడు ఈ విజయ సమయంలో ఇలాంటి విషయాలపై మాట్లాడటం సరికాదు. ఇది జట్టు సంబరాలను చెడగొడుతుందని అన్నారు.
Airtel Prepaid Plan: యూజర్లకు షాక్.. ఆ చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను నిలిపివేసిన ఎయిర్‌టెల్
అలాగే హర్మన్ ప్రతిభపై మాట్లాడిన అంజుమ్.. మొదటి రోజు నుంచే ఆమె ప్రత్యేకమని నాకు తెలిసింది. 2007-08లో ముంబైలో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీలో ఆమె బలమైన షాట్లు ఆడిన తీరు నాకు బాగా గుర్తుంది. ఆ సమయంలోనే ఈమె భారత జట్టులో పెద్ద స్థాయిలో సాధిస్తుందని నమ్మకం వచ్చిందని చెప్పింది. అలాగే హర్మన్ ఎప్పుడూ మ్యాచ్ విన్నర్‌గానే ఉందని.. అందుకే ఆమె కెప్టెన్‌గా కొనసాగాలని తాను ఎప్పుడూ విశ్వసించానని అభిప్రాయపడింది. వరల్డ్ కప్ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ఈ జట్టు భారత క్రికెట్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించిందని పేర్కొంది.