Telangana Elections 2023: ఏ రాజకీయ పార్టీ అయినా, ఇతర నాయకులను ప్రభావితం చేయడం ద్వారా, ప్రత్యర్థి పార్టీలకు మంచి ప్రజా మద్దతు ఉందని సంకేతాలను పంపుతుంది.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో నిర్వహించి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, harish rao, congress, brs, cm kcr
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దారుణంగా దాడి చేశారని మంత్రి హరీశ్ మండిపడ్డారు. తర్వాత కోడికత్తి, కత్తిపోటు అంటూ హేళన చేశారని మంత్రి ఆవేదన వ్యకం చేశారు. గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.. గువ్వలపై కాంగ్రెస్ నేత వంశీకృష్ణ స్వయంగా రాళ్లు విసిరారని మంత్రి హరీశ్ వెల్లడించారు.
కాళేశ్వరం మీదు ఏ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్, హరీశ్ రావు మీద బురద చల్లడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోదాడతో పాటు పలు నియోజకవర్గాలకు సాగునీరు వచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వచ్చిన మంచి పేరును చెడగొట్టాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్పై నమ్మకం, మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తాయని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి పేర్కొన్నారు. నాకు నేను ట్రబుల్ షూటర్ అని ఎప్పుడూ చెప్పుకోలేదని.. హరీశ్ రావు ఏనాడు కేసీఆర్ మాట జవ దాటలేదన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్టీపీ తప్పుకున్నాయి. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో పోటీ వద్దని చెప్పడంతో కాసాని జ్ఞానేశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనై ఆ తర్వాత బీఆర్ఎస్లోకి అనుచరులతో చేరిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రామారావు కుట్రల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త ప్రభాకర్ మీద దాడి జరిగితే.. గాయపడ్డ ప్రభాకర్ కంటే.. ముందే హరీష్ ఆసుపత్రికి వెళ్ళాడని రేవంత్ రెడ్డి అన్నారు. కత్తి పోట్లకు గురైన ప్రభాకర్ రెడ్డి నడుస్తూ కారెక్కాడు.. హరీష్ మాత్రం పరుగు పరుగున పరిగెత్తాడని విమర్శించారు. ఈ దాడి వెనక పీసీసీ బాద్యుడు అని కేసీఆర్ అన్నాడన్నారు. కానీ…
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఓదెల జడ్పీటీసీ రాములు యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి హరీశ్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. ఉచిత కరెంట్ను ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు.