బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇక, పలువురు మాజీ మంత్రులు ఇతర నేతలు కూడా కేసీఆర్ ని కలిసిన వారిలో ఉన్నారు.
Read Also: Tripti Dimri: మార్కెట్ లోకి కొత్త క్రష్ వచ్చింది మావో..
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తీర్పును గౌరవిద్దాం అని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండే.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం.. కొత్త ప్రభుత్వానికి సహకరిద్ధం అని ఆయన చెప్పుకొచ్చారు. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.. త్వరలో తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫలితాలపై సమీక్ష సమావేశం నిర్వహిస్తాను.. త్వరలో శాసన సభ పక్ష నేతను ఎన్నుకుందామని కేసీఆర్ పేర్కొన్నారు.
Read Also: Amaravati: అమరావతే ఏపీ రాజధాని.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం..
అయితే, అంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్‌కు వెళ్లారు. ఇక, కేసీఆర్ ను కలిసిన వారిలో హరీశ్ రావు, కేటీఆర్, పట్నం మహేందర్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కడియం, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఇతర నేతలు ఉన్నారు.