RythuBandhu: తెలంగాణ సర్కార్‌కు ఈసీ షాక్.. రైతు బంధు అనుమతి ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Bandhu: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల పంపిణీకి అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు ఉన్నట్టుండి రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ పడింది. అయితే దీనిపై ప్రభుత్వ ప్రతిపదనకు ఎన్నికల కమిషన్ నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. అయితే, నవంబర్ 28వ తేదీలోపు రైతులకు నిధులు జమ చేయాలని సూచించింది. ఎన్నికల కమిషన్ నిధుల విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించినట్టు అయ్యింది..
కానీ, రైతు బంధు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇప్పుడు నిధులు విడుదల చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్.. రెండు రోజుల క్రితం రైతు బంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిన ఈసీ.. అయితే, 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు వెలువడిన ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ఇక, ఎన్నికల కమిషన్ నుంచి రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో.. నిధుల పంపిణీకి సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. నిన్న ఓ బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్ టింగ్ టింగ్ అంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయిన మెసేజ్‌లు వస్తాయని ప్రకటించారు.. అయితే, ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంది.. గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.. కానీ, హరీష్‌రావు.. సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు.. మరోవైపు.. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈ నెల 30వ తేదీన జరగనుంది.. ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడం ఏంటి? అనే ఫిర్యాదులు కూడా ఎన్నికల కమిషన్‌కు వెళ్లియట.. దీంతోనే.. ఎన్నికల కమిషన్ అనుమతిని ఉపసంహరించుకున్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?