సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు…
Vijayshanti Tweet: కాంగ్రెస్ నేత విజయశాంతి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ‘సుమారు 10 సంవత్సరాల తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి, 5 లక్షల కోట్ల అప్పు…
Ponguleti: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు రోజులు కూడా కాకముందే హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. వరి ధాన్యం కొనుగోలు ఎప్పుడు ప్రారంభిస్తారు.. బోనస్ కింద రూ.500 ఎప్పుడు ఇస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్ ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Minister Harish Rao Cast His Vote: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి ఓటేస్తున్నారు. మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా భరత్ నగర్లోని అంబిటస్ స్కూల్ 114 పోలింగ్ స్టేషన్లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు. Also…
Jagga Reddy: నా మనసులో మాట చెప్తున్నాను అని సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థికి ఒక సూటి ప్రశ్న? అని తెలిపారు
ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది అని నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరంజన్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.