Minister Harish Rao Cast His Vote: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. రాజకీయ, సినీ ప్రముఖులు కూడా సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి ఓటేస్తున్నారు. మంత్రి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా భరత్ నగర్‌లోని అంబిటస్ స్కూల్ 114 పోలింగ్ స్టేషన్‌లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు.
Also Read: Telangana Elections 2023: ఓటర్లు లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రం.. కారణం ఏంటంటే?
నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్ నగర్‌లోని బూత్ నెం. 89లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ సాధన స్కూల్ పోలింగ్ సెంటర్‌లో కుటుంబ సమేతంగా వచ్చి బండి సంజయ్ ఓటు వేశారు. కుటుంబ సభ్యులతో కలిసి కరీంనగర్ జ్యోతినగర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ ఓటేశారు.