MLC Jeevan Reddy: హరీష్ రావు తెలుసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయం లో జరిగిన జగిత్యాల అభివృద్ధి ఉమ్మడి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలిచిందని క్లారిటీ ఇచ్చారు.
Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Harish Rao: కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ గాంధీ కాదు గాడ్సే అని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను అమ్ముకున్న దరిద్రులు మీరు అంటూ ధ్వజమెత్తారు.
రైతు గర్జనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని విమర్శలు గుప్పించారు. రైతు బంధు, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్ళ కోసం రైతు దీక్ష చేస్తున్నాం.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపేందుకే రైతు దీక్ష చేస్తున్నామన్నారు.
Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్కు కనీసం బుద్ధి కూడా లేదని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి, ఆమెకు జామీన్ వచ్చే రోజు రెండ్రోజులు ముందే ఢిల్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే మాట అనేవి అన్నాడు, తప్పు చేసినప్పుడు పెద్ద పెద్ద నాయకులే జైలుకెళ్లిపోతే కేటీఆర్ ను ఎవరూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై…
Harish Rao: రాహుల్ గాంధీ మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్లోని నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే.. మీ సో-కాల్డ్ ప్రజా పాలనలో విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది అని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారని, 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదన్నారు మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం,పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు.