Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయి.. ప్రతి పక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్
- ప్రతిపక్షాలపై రేణుకా చౌదరి హాట్ కామెంట్స్..
- ఇవ్వాళ హరీష్ రావు పర్యటననే ఓ జోక్..
- పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు.. దమ్ముంటే నాతో రా....కలిసి నడుద్దాం..
- ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయని హాట్ కామెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Chowdhury: ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రతి పక్షాలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాట్ కామెంట్ చేశారు. ఖమ్మం జిల్లాలో రెండు రోజులపాటు హరీష్ రావు పర్యటన నేపథ్యంలో రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి వరకు కుక్కిన పేనులా ఉన్న అజయ్ నేడు మీసాలు తిప్పుతున్నాడని అన్నారు. రైతులకు భేడీలు వేసిన వాళ్ళు ఇవ్వాళ మాట్లాడుతున్నారని తెలిపారు. దుష్టశక్తులు ఏవో మాట్లాడుతున్నారని అన్నారు. కార్తీక మాసంలో అపశకుణం మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ కు రబీకు తేడా తెలియని వారు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు.
Read also: Telangana CMO: మాట నిలబెట్టుకున్న ప్రజా ప్రభుత్వం.. దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
పోలీసులు లేకుండా జనాల్లోకి వచ్చినా మొహాలామీవి అని కీలక వ్యాఖ్యలు చేశారు. గుట్టలు మాయం చేసిన మీరా మాట్లాడేది అంటూ మండిపడ్డారు. కోయిన్ని వెంకన్నను అడిగితే మీ పాపాలు బయట పడతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ప్రజల మీద సానుభూతి ఉంటే సలహాలు సూచనలు చేయండి…. స్వీకరిస్తాం అన్నారు. రాష్ట్రం లో ఒక మాట దేశంలో ఒక మాట అంటూ మండిపడ్డారు. బిడ్డను జైల్ నుంచి విడిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో దేశ ప్రజలకు తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారన్నారు. రేవంత్ పాలన భేష్ అన్నారు. బీఆర్ఎస్ వాళ్లకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయని తెలిపారు.
Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
ఇవాళ హరీష్ రావు పర్యటననే ఓ జోక్ అన్నారు. నాగలి పట్టి దున్నిన మోహలా మీవి అన్నారు. మీ బ్రతుకులు కమిషన్ కాకతీయ, కమిషన్ భగీరథ అని తెలిపారు. మీరు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయారన్నారు. బీడీలు వేసిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. ప్రజలను నానా హింసలు పెట్టింది మీరే అని మండిపడ్డారు. ఓడిపోయి ఏమి చేయాలో తెలియక ఇలాంటి జోకులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర హారాలు మని రేవంత్ పని చేస్తున్నారని తెలిపారు. మీకు ఆత్మగౌరవం ఉందా? అని మండిపడ్డారు. మీకు రాష్ట్ర ప్రయోజనాల మీద కమిట్మెంట్ ఉందా అన్నారు. మీ రాజ్యసభ సభ్యులు ఏ స్కీం తెచ్చారన్నారు.
Read also: RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..
పువ్వాడ అజయ్ కు ఏమీ కనబడవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే నాతో రా….కలిసి నడుద్దాం అన్నారు. నేను తిరిగిన ఊళ్ళు నీవు తిరిగావా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు మోపిన భారాన్ని మీరు, మనం కట్టలిసినా పరిస్థితి అన్నారు. నెల కాగానే జీతాలు ఇస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలతో సుజాతనగర్ లో రైతులు ఇబ్బందులు పడితే రైతుకు 6500 ఇప్పించానని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను రాష్ట్ర బహిష్కరణ చేయాలన్నారు. కొత్తగూడెంలో ఫ్రీ కండిషన్ ఎయిర్ పోర్ట్ రానుందన్నారు. ఆ రోజుల్లోనే కార్గో ప్లెయిన్ కూడా అడిగా అని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో అడవి అనేది లేకుండా పోయిందన్నారు. వైరాలో రైతులకు పంటల పై అవగాహన కోసం హాస్టల్ కట్టించాలని అనుకున్నామన్నారు. కొత్తగూడెం రైల్వే భూములను మనం తీసుకొని వాళ్లకు వేరే భూమి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
Read also: Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..
ఖమ్మంను మర్చిపోనే పోను..నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను.ఆ బిరుదు అది శాసిత్వం అన్నారు. వచ్చే ఏడాది స్తంభాద్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. మత్స్యకారుల పండుగ రోజున పాలేరులో ఉత్సవాలు జరుపబోతున్నాం అన్నారు. నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ను అభివృద్ధి చేయాలని టూరిజం శాఖ మంత్రిని కోరింది అన్నారు. కేటీపీఎస్ లో ఓ స్టేజి వచ్చిందంటే నా కృషి ఉంది అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పాల్వంచ స్పాంజ్ ఐరన్ ను మూసి వేసిందన్నారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకులతో మాట్లాడి మళ్ళీ తెరిపించాలని పోరాటం చేస్తాం అన్నారు. కేటీఆర్ మాటలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం మొత్తం డొల్ల అంటే మీరు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. మూసి ప్రక్షాళన ముమ్మాటికీ అవసరమే అన్నారు. ఏనుగులు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో జిల్లా అభివృద్ధి కోసం అన్నారు.
Manish Sisodia: లిక్కర్ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఢిల్లి మాజీ డిప్యూటీ సిఎం
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..