Aadi Srinivas : కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారు
- హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా?
- వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా?
- హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? : ఆది శ్రీనివాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadi Srinivas : హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వర రావు ఇప్పుడు కూలేశ్వర రావు గా మారిపోయారని, హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా? అని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా? హరీష్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి దూరం పెట్టలేదా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కొప్పడడం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదని ఆది శ్రీనివాస్ అన్నారు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిది? అని ఆయన మండిపడ్డారు. హరీష్ రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నాడని, బీఆర్ఎస్ సినిమా అయిపోయిందన్నారు ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని, రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందన్నారు.
PM Modi-Putin: భారత్‌లో పర్యటించండి.. పుతిన్‌కి మోడీ ఆహ్వానం..
Also Read
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్ కండ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారన్నారు. పడేండ్లలో రైతులకు 80 వేల కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెబుతున్నారని, మేం పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామన్నారు ఆది శ్రీనివాస్. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని, వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబందు వేసిందన్నారు. కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని, గత పదేండ్లలో ఒక్క డీఏస్సీ కూడా వేయలేదన్నారు. కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటి? అని ఆయన వ్యాఖ్యానించారు. మేం ఎవరి లెక్క ఎంతో తేల్చడానికి సర్వే చేస్తున్నామని, బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా? వ్యతిరేకమా? అని ఆది శ్రీనివాస్ అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చాలని కేసీఆర్ అన్నారని, హైదరాబాద్ మునిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? అబద్దాలు మాట్లాడే హరీష్ రావు ఇప్పటి నుండైనా నిజాలు మాట్లాడాలని కోరుతున్నానన్నారు.. ఈ సీజన్లో కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా వినియోగంలోకి రాలేదన్నారు ఆది శ్రీనివాస్.
Student Suicide: బాచుపల్లి ఇంపల్స్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్ధిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!