KCR Movie Pre Release Event: జబర్దస్త్ కమెడియన్ గా పరిచయమైన రాకింగ్ రాకేష్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా ‘కేశవ చంద్ర రమావత్’ (KCR). ఈ సినిమాకి గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ నిర్మాణం చేస్తోంది. ఇందులో రాకేష్ సరసన అనన్య కృష్ణ కథానాయకగా నటించింది. ఈ సినిమాను నటుడు రాకింగ్ రాకేష్ స్వయంగా నిర్మించాడు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. లంబాడి వర్గానికి చెందిన యువకుడి నిజ జీవితం నుండి స్ఫూర్తి పొందినదిగా తెలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యనే రిలీజైన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నుంచి మంచి స్పందన వచ్చింది. నవంబర్ 22న సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా యూనిట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీమంత్రి హరీష్ రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Also Read: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?
రాకేష్ కేసిఆర్ పేరు మీద సినిమా తీయడం సంతోషమని, కేసిఆర్ అంటే ఒక చరిత్ర అని అయ్యన అన్నారు. కేసిఆర్ తెలంగాణను సాధించడమే కాదు.. అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారని ఆయన అన్నారు. ఒకసారి హీరో రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారని తెలుపుతూ.. నేను హైదరాబాద్ లో ఉన్నానా? లేదా న్యూయార్క్ లో వున్నానా? అన్నారని తెలిపాడు. కేసిఆర్ పల్లెలను అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశారు. హైదరాబాద్ ని మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు, సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణాని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారని కేసిఆర్ గురించి అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కెసిఆర్ చేసిన కృషి అని అయన అన్నారు. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు కానీ.. అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో కావచ్చు.. దమ్ము, ధైర్యంతో ఈ సినిమా తీశారని ఆయన అన్నారు.