Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట్ట ముంచిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ముంచింది కాక సిగ్గులేకుండా సంబరాలు చేయమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ వరకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన నేను బహిరంగ చర్చకు సిద్ధమని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు రైతులకు అమాలయ్యాయా..? అని ఆయన వ్యాఖ్యానించారు. 15…
ఎర్రవల్లి ఫామ్హౌజ్లో మాజీ మంత్రులు కేసీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో నిన్న కేటీఆర్ను ఏసీబీ 7 గంటలు విచారించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. ఏసీబీ విచారణకు సంబంధించి విషయాలను కేటీఆర్ కేసీఆర్కు వివరించారు.
Harish Rao : ఒక మహిళ మృతి చెందారు, ఇక మీదట సినిమాలకు స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండు వారాలు కూడా తిరగకముందే ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. టికెట్ రేట్లు పెంచేది లేదంటూ అదే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు సైతం స్వల్ప వ్యవధిలోనే నీటి మూటలు అయ్యాయని, అసెంబ్లీలో ప్రకటించిన…
Harish Rao : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచినట్లు గుర్తు చేస్తూ, ఉద్యమకాలపు జ్ఞాపకాలు తాజా డైరీలో ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం నేటి డైరీ ఆవిష్కరణ…
తెలంగాణ భవన్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది.. తొందరగా వెళ్లి కలవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత.. ఇదొక లొట్టపీసు కేస్.. వాడు ఒక ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఆయన పీకేది ఏమి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం…
ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్…
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ ప్రశ్నించింది. “అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశాం. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశాం. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేశాం. 46 కోట్ల రూపాయలను విదేశీ…
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది.
ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్కు నోటీసు ఇచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. "ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి"అని కేవియట్ పిటిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.