Kaushik Reddy Arrest: కౌశిక్ రెడ్డి అరెస్ట్.. రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్..
- కౌశిక్ రెడ్డి అరెస్ట్
- రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఎమ్మెల్యే
- రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్‌ఎస్‌కు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్ కొనసాగింది. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిసింది. రాత్రి త్రీ టౌన్ లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. ఎమ్మెల్యేపై ఇప్పటికే వన్ టౌన్ లో మూడు, త్రీ టౌన్ లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్స్ మేరకు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.తెలిపారు. నిన్నంతా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది.. కరీంనగర్ లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.
READ MORE: Mahakumbh First Amrit Snan: ప్రయాగ్‌రాజ్‌లో నేడు మొదటి ‘అమృత స్నాన్’.. ఘాట్స్ వద్ద లక్షలాది భక్తులు!
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ, 13 నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు నిలయంగా మారడం శోచనీయమని, ప్రశ్నిస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు బనాయించడం, నిలదీస్తే పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు హరీష్ రావు. ఆరు గ్యారంటీలు, హామీల అమలు, పరిపాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!