మా హయాంలో లక్ష ఆరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాము.. కానీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారు.. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇరవై నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు పండుగ చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే, అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు తనకు తెలుసని.. భూమి చుట్టూ మన త్యాగాలు, జీవితాలు ఉన్నాయన్నారు.. వ్యవసాయం దండుగా…
వానాకాలం పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమచేస్తోంది. రైతులకు డబ్బులు అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేపు రైతు భరోసా సంబరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ రైతు భరోసా సంబరాలపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు సంబరాలు చేయాలా?.. రూ. 15 వేలు ఇస్తానని…
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
Harish Rao : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజన పథకాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే…
MLC Addanki Dayakar: చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి హరీష్ రావు పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ పైన మాట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావువి పిచ్చి కూతలు.. తెలంగాణ మీ అయ్య జాగీరా అని కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకు ఆ నాడు ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
Harish Rao: తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు.
Harish Rao: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితులపై కౌంటర్ వేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరుగుతున్న విచారణల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ.. లొట్టపీసు కేసులో కేటీఆర్ విచారణకు వెళ్లి వచ్చారు. కానీ, ఇది కేవలం రాజకీయ కక్షనే అని అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి 14 నెలల కాలంలో కేటీఆర్‌పై 14 కేసులు…
Harish Rao : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి నీటిని మూడు దశల్లో బనకచర్ల వరకు తరలించేందుకు కేంద్రానికి PFR సమర్పించడాన్ని హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హస్పటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే, నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్.