Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింది. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందింది. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమీషన్‌కు అందజేశాం. కానీ, కమీషన్‌కు ఇచ్చిన ఆ డాక్యుమెంట్లను మాకు కాపీ ఇవ్వాలని సెక్రటరీని అడిగాను అని తెలిపారు. అలాగే, నేను సీఎస్, జీఎడీ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలకు లేఖ రాసాను. కానీ ముగ్గురి నుంచి సరైన సమాధానం రాలేదు. అసలు కమీషన్‌కు నిజమైన వివరాలు ఇస్తున్నారా..? లేదా..? అనే అనుమానం వస్తోందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also:Bandi Sanjay Kumar: టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలెలా ఇస్తారు..?
తెలంగాణకు నీటి పంచాయితీలో జరిగిన అన్యాయంపై కూడా హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కృష్ణా బేసిన్ లోని 299 టీఎంసీల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అయ్యాక కేవలం 42 రోజుల్లోనే కేసీఆర్ కేంద్రాన్ని నీటి పంపిణీ కోసం అడిగారు. కానీ, ఇప్పుడు సీఎం రేవంత్ ఆ నిజాన్ని దాచి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ నీటి పంపకం ట్రిబ్యునల్ పరిధిలో ఉందని స్వయంగా ఓపెన్‌గా అన్నాడు. బోర్డు తాత్కాలికంగా వాటాలను వెల్లడిస్తుందని ఆయన అంగీకరించాడు. ఇప్పుడు అదే విషయాన్ని తాము చెప్పగానే దానిని తప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి సీఎం రేవంత్‌కు బేసిన్‌లు గురించి కనీస అవగాహన లేదు అంటూ హరీశ్ తీవ్ర విమర్శలు చేశారు.
Read Also:Curtis Campher: 5 బంతుల్లో 5 వికెట్లు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ బౌలర్..!
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా..? లేక చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా..? అన్నదే ప్రశ్న అంటూ మాట్లాడారు. బేసిక్ లు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. నీటి విషయాల్లో కనీస అవగాహన లేని ఆయన నీటి మంత్రిని చేశారు. ఇది రాష్ట్రానికి గొడ్డలి పెట్టు అవుతుందని హరీశ్ అన్నారు.