Student suicide: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్వీ ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లుబోయిన అచ్యుత్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు.
Call Money: తాజాగా ఏలూరులో కాల్ మనీ దందాలు సంబంధించి వరుసగా కేసులు వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వస్తు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. తీసుకున్న డబ్బులకి పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడంలేదని ఆవేదన చెందుతున్నారు. ముఖయంగా అధిక వడ్డీలు చెల్లించలేకపోవడంతో, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్ళిపోయే బాధితులు గతంలో కూడా పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని కొందరు బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Also Read: Road Accident: ఘోర…
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాఠశాలకు రెండు జడలు వేసుకురాలేదని చిన్నారులపై టీచర్ కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో జరిగింది. బాలికలు రెండు జడలు వేసుకరాలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్ర ఆగ్రహానికి గురై వారిని దారుణంగా చితకబాదింది. దీంతో.. ఓ విద్యార్థి అపస్మార స్థితికి వెళ్లింది.
పోలీసులు తనను వేధించిన విషయాన్ని ఓ బాధితురాలు వెల్లడించింది. ఆ రాత్రి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలిపై పోలీసు సిబ్బంది చేసిన అమానుష ప్రవర్తన వింటే మీరు కూడా షాక్ అవుతారు.
Harassment: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్‌లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసేందుకు అతని ఇంటికి వెళ్లగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సభ్యులు సదరు వివాహితపై దాడి చేసి తల గుండు గీయించారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మరువక ముందే హర్యానాలో మరో ఘటన చోటుచేసుకుంది. కోల్‌కతా ఘటన జరిగిన కొన్ని రోజులకే రోహ్‌తక్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సీనియర్ వైద్యుడు దాడికి పాల్పడ్డాడు.
Sangareddy Crime: ఇన్స్టాగ్రామ్ లో యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇన్స్టా గ్రామ్లో ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని బీ.ఫార్మసీ చదువుతోంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది.
కన్న కొడుకు నుండి రక్షణ కల్పించండంటూ, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు ఓ సీఐ తల్లిదండ్రులు. నలుగురికి రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ సీఐ వేధిస్తున్నాడు. కొడుకు నుండి రక్షణ కల్పించాలంటూ బాధిత తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీని కలిసి కొడుకు పై ఫిర్యాదు చేశారు.