డీఎంకే నేత, పల్లవరం ఎమ్మెల్యే ఐ.కరుణానిధి కోడలుపై పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల పని మనిషి చెన్నైలోని ఎమ్మెల్యే కోడలు దగ్గర పని చేస్తుంది. అయితే తనను వేధింపులకు గురి చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పని మనిషి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేటకు చెందినదిగా గుర్తించారు. తనను ఎమ్మెల్యే కోడలు మార్లీనా పదే పదే వేధించిందని, అంతేకాకుండా కొన్నిసార్లు కొట్టేదని ఉలుందూరుపేట పోలీసులకు తెలిపింది.
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన తెలిపినందుకు ఓ బాలికను క్రషర్‌లో వేసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. బాగ్‌పత్‌లో.. క్రషర్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏంటని బాలిక నిరసన వ్యక్తం చేయగా.. ఆమెను క్రషర్‌లోని వేడి నిప్పులలోకి విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు…
వైసీపీ నేతల వేధింపులతో ఓ కాంట్రాక్టు కార్మికుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా హలహర్వి మండలం అమృతపురంలో చోటుచేసుకుంది. వాటర్ మ్యాన్ కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాం సూసైడ్ చేసుకుంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హాలచల్ చేస్తోంది. ఆమృతపురం వైసీపీ నాయకులు తనపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం నుంచి తీసేశారని కాంట్రాక్టు కార్మికుడు పరుశురాం ఆరోపించాడు. ఆమృతపురం వైసీపీ నాయకులు గుమ్మునూరు నారాయణస్వామి, దిబ్బిలింగ, శేఖర్ కలిసి కాంట్రాక్ట్ కార్మికుడు పరుశురాంను…
Principal Harassment: హర్యానాలోని జింద్‌లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 15 మంది బాలికలు లైంగిక దోపిడీకి పాల్పడినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, భారత ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మహిళా కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
Hanmakonda: వరకట్నం అడగడం, తీసుకోవడం నేరం.. ఇది అనాదిగా చెప్పుకుంటూ వస్తున్నాం. వరకట్న దురాచారాన్ని రూపుమాపడానికి ఎంతోమంది సంఘసంస్కర్తలు ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేశారు.
Student Vaibhav: నగరంలోని జిల్లెలగూడలో మంగళవారం ఇంటర్ విద్యార్థి వైభవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ యాజమాన్యం వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని ఆత్మహత్యకు ముందు వైభవ్ సూసైడ్ నోట్ రాశాడు.
Navi Mumbai: మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వావీవరసలు మరిచి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. పరువు కోసం బయటకు రాని కేసులు అనేకం ఉంటున్నాయి.