Harassment: అత్తమామల వేధింపులు.. సెల్ఫీ వీడియో తీసుకుని అల్లుడు సూసైడ్
- అత్తమామల వేధింపులకు అల్లుడు బలి
- అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య
- చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి సూసైడ్
- యూపీలోని ఇటావాలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఇటావాలో అత్తమామల వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. అత్తమామల వేధింపులతో విసిగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన బాధను వ్యక్తం చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్, డీఎంలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన షేకుపూర్ పచార్ వైర్ సమీపంలో చోటుచేసుకుంది. అహకరిపుర గ్రామానికి చెందిన అర్పిత్ యాదవ్ (24) శుక్రవారం రాత్రి 9.30 గంటలకు నిర్మాణంలో ఉన్న పెట్రోల్ పంపు వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం శాంపిల్స్ సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Read Also: Uttar Pradesh: విషాదం.. ఆలయ గోడ కూలి శిథిలాల కింద నలుగురు సమాధి..!
Also Read
ఈ సమయంలో మృతుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో తన అత్తమామలు వేధిస్తున్నట్లు మాట్లాడాడు. 2022 ఫిబ్రవరిలో ఒసాన్ సింగ్ యాదవ్ కుమార్తె కృష్ణతో పెళ్లయింది. వారికి 8 నెలల కుమారుడు కూడా ఉన్నాడని వీడియోలో చెప్పాడు. అయితే.. అత్తమామల వేధింపులు ఎక్కువయ్యాయని.. వరకట్నం కేసులో రోజూ తనను జైలుకు పంపిస్తామని బెదిరించే వారు. ఆ బెదిరింపులను భరించలేను.. ఇంట్లో అమ్మ గీతాదేవి, సోదరుడు లక్కీ యాదవ్, సోదరి నేహా యాదవ్ ఉంటారు. నేహా చికిత్స కోసం ఇంతకుముందు చాలా డబ్బు ఖర్చు అయింది. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. పొలానికి వెళ్లే దారి కూడా ఆక్రమణకు గురైంది. సహాయం కోసం ప్రాంతీయ నాయకులు మనీష్ యాదవ్, పాత్రే యాదవ్‌లను విజ్ఞప్తి చేసినట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ నుండి సహాయం కోసం వేడుకున్నాడు.. తన సోదరి ఆరోగ్యం బాగా లేదని, కుటుంబ పరిస్థితి కూడా బాగా లేదని చెప్పాడు. తన సోదరికి వైద్యం అందించి కుటుంబాన్ని ఆదుకోవాలని సెల్ఫీ వీడియోలో చెప్పాడు.
Read Also: Bengaluru: బెంగళూర్‌లో మరో శ్రద్ధావాకర్.. ఫ్రిజ్‌లో 32 ముక్కలుగా మహిళ శరీర భాగాలు..
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!