Hyderabad Crime: విషాదం.. కోడలు వేధింపులతో పురుగుల మందు తాగిన కుటుంబసభ్యులు..
- సికింద్రాబాద్ తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఓ కుటుంబం ఆత్మహత్యయత్నం..
- రూమ్ లో అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
- యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్న మహంకాళి పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: కోడలు వేధింపులు తాళలేక కుటుంబ సభ్యులు మొత్తం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపింది. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాజ్ త్రి స్టార్ హోటల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. హోటల్ లోని మూడవ అంతస్తులో 308 గదిలో ముగ్గురు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ఠలికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురిని 108 అనబులెన్స్ లో యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు ముగ్గురూ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చెందినవారుగా గుర్తించారు. తండ్రి నారాయణ (52) తల్లి పద్మావతి (47 ) కొడుకు సృజన్ (23) గా గుర్తించారు. ఇటీవలే ఫిబ్రవరి 14న తల్లిదండ్రులు.. కొడుకు సృజన్ ను ఘనంగా పెళ్లి చేశారు.
Read also: Festival Rush: హైదరాబాద్‌లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
Also Read
అయితే కొద్ది రోజులు బాగా సాగిన వీరి జీవితంలో మనస్పర్థలు మొదలయ్యాయని సమాచారం. దీంతో కోడలు కావ్య కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలోని చెంచిపల్లి పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్తపై 498 A కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులు అందరు కోడలు కావ్వకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. ముగ్గురు కలిసి సికింద్రాబాద్ చేరుకుని తాజ్ త్రి స్టార్ హోటల్ లోని 308 రూమ్ లో బస చేశారు. వీరు ముగ్గురు కలిసి కోడలికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నాట్లు తెలిపారు. అవమానం భరించలేమని జ్యూస్ లో మత్తుపదార్డం కలిపి ముగ్గురు సేవించారు. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గురిని హూటల్ యాజమాన్యం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనేవ వీరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరి ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కోడలు కావ్వ, భర్త సృజన్ పై పెట్టిన కేసుపై ఆరా తీస్తున్నారు.
Health Tips: మెంతి ఆకులు, గింజలు గొప్పతనం తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?