Student suicide: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్వీ ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లుబోయిన అచ్యుత్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అచ్యుత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కాలేజీ ప్రిన్సిపాల్ అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణ ఉన్నాయి. ఫారెన్సీక్ కౌన్సిలింగ్ కి రేపు ఆఖరి రోజు కావడంతో సర్టిఫికెట్లు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరిన అచ్యుత్.. ఇవ్వడం కుదరదు.. అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయండంతో తీవ్ర మనస్థాపనకు గురైన విద్యార్థి అచ్యుత్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకునేందుకు యత్నించాడు. అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై కళాశాల దగ్గర విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: CM Revanth Reddy : కాకా పేదల మనిషి.. ఆయన పేదోళ్ల ధైర్యం..
ఇక, ఈ ఘటనపై పోలీసులకు విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయడంతో.. ఎస్వీ ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ మురళీపై కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.