ICC World Cup 2023: ఇండియా వేదికగా ఐసీసీ ప్రపంచకప్ 2023 క్రికెట్ సమరం ప్రారంభం కానుంది. అందరి కళ్లు అహ్మదాబాద్ లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచు ప్రారంభానికి ముందు ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పన్నూపై అహ్మదాబాద్ పోలీసులు పన్నూపై ఎ
India-Canada: కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా-కెనడాల మధ్య దౌత్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కొందరు ఖలిస్తానీ ఎలిమెంట్స్ మాత్రం ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతతలు పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఇండియాకు, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కెనడాలో ఆందోళన, నిరసన చేపడుతున్నారు. మరోవైపు సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హిందువులను టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగువస్థాయికి చేరాయి. అయితే ఒక్క నిజ్జరే కాదు చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకుంటూ భారతదేశంపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఏకంగా భారత దేశాన్ని విడగొట్టాలనే కుట్రకు పాల్పడినట్లు మన నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్కూస్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జప్తు చేసిన సంగతి తెలిసిందే. గత వారం చండీగఢ్, అమృత్‌సర్‌లోని పన్నూన్ ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైసంది.
Khalistan: ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోతున్నారు. కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడటంతో పాటు ఆయా దేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడికి పాల్పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ‘సిక్ ఫర్ జస్టిస్’ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారతీయ నాయకులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Gurpatwant Singh Pannun: కరుడుగట్టిన ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బతికే ఉన్నట్లు తెలుస్తోంది. అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్‌గా ఉన్న ఇతను నిత్యం భారతదేశంపై విషం చిమ్ముతూనే ఉన్నాడు.
Interpol Sent Back India's Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్‌పుట్‌లను సమర్పించింది. అయితే ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది.