Khalistani terrorist: కెనడాలో ఉంటూ, ఖలిస్తాన్ అంటూ గొడవ చేసే ఉగ్రవాదులు భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌కు ఖలిస్తానీ ఉగ్రవాది ఇందర్ జీత్ గోసల్ బెదిరింపులు జారీ చేశారు. అరెస్ట్ అయిన కొద్ది రోజులకే కెనడాలో బెయిల్ పొందిన ఇందర్ జీత్ ‘‘ దోవల్, నేను మీ కోసం ఎదురు చూస్తున్నాను’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు.
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌ని బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి, భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు.
America: అమెరికాలోని ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ యొక్క బ్యాంకు వివరాలను భారత్‌కు ఇవ్వడం కుదరదు అని అక్కడి పోలీసులు తెలిపారు.
Donald Trump: ఖలిస్తాన్ ఉగ్రవాది, అమెరికన్ సిటిజన్ అయిన గురుపత్వంత్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణతో భారత మాజీ ఇంటెలిజెన్స్ అధికారిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ప్రాసిక్యూటర్ డామియన్ విలియమ్స్‌ని కొత్తగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఇతడి స్థానంలో న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌కి డిస్ట్రిక్ట్ అటార్నీగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) మాజీ ఛైర్మన్ జే క్లేటన్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ గురువారం ప్రకటించారు
Khalistani Terrorist: భారత్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఒకప్పటి సీఆర్‌పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లు తమ(సిక్కుల) హక్కుల హననానికి పాల్పడ్డరారని పన్నూన్ ఆరోపణలు చేశాడు.
Pannun Murder Plot: పన్నూన్ హత్యకు కుట్ర కేసు దర్యాప్తులో భారత్ బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకొంటుందని తాము ఆశిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.