Interpol Sent Back India’s Request For Notice Against Khalistan Separatist: ఖలిస్తానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై భారత్ చేసిన అభ్యర్థనను ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్(ఇంటర్‌పోల్) తిప్పిపంపింది. పన్నూపై ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీస్ కోసం భారతదేశం అభ్యర్థించింది. అయితే ఈ అభ్యర్థనను ఇంటర్‌పోల్ తిప్పిపంపినట్లు తెలుస్తోంది. సీబీఐ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని ఇన్‌పుట్‌లను సమర్పించింది. కాగా వీటిపై ఇంటర్‌పోల్ ప్రశ్నలను లేవనెత్తింది.
ఇదిలా ఉంటే ఉగ్రవాద నిరోధక చట్టం చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టాన్ని(యూఏపీఏ) చట్టాన్ని దుర్వినియోగంపై ఇంటర్‌పోల్ ఎటువంటి కామెంట్స్ చేయలేదని భారత ప్రభుత్వ వర్గాలు నొక్కి చెప్పాయి. మైనారిటీలను, హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటూ యూఏపీఏ చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
గతంలో హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలతో అసెంబ్లీ గోలపై ‘ ఖలిస్తాన్’ బ్యానర్లు, గ్రాఫిటీ పెంటింగ్స్ కనిపించాయి. దీనికి ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాద సంస్థ సిఖ్ పర్ జస్టిస్(ఎస్ఎఫ్ జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ సంస్థ ద్వారా అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ సంస్థను కేంద్రం 2019లో నిషేధించింది.
Read Also: Kerala Black Magic Case: నరబలి కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు.. చంపి వండుకుని తినేసిన భార్యాభర్తలు!
ఈ ఏడాది జనవరిలో ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నిని ఐఎస్ఐ కార్యకర్త జస్వీందర్ సింగ్ ముల్తానీ గురించి సమాచారం అందించిన వారికి ఎన్ఐఏ రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ముల్తానీ, గురుపత్వంత్ సింగ్ పన్నూకు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని గ్యాంగ్ స్లర్లు, ఉగ్రవాదుల ద్వారా భారత పంజాబ్ లోని పంపి ఉగ్రవాదాన్ని పెంచాలని ముల్తానీ ప్లాన్ చేశారు.
గురుపత్వంత్ సింగ్ పన్నూ యూకేలో ఉంటూ.. కెనడా, యూఎస్ఏ భూభాగాల నుంచి భారత వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు. గతంలో పంజాబ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యానికి ఈ ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపే కారణం అని తెలుస్తోంది. ఇదే కాకుండా యూకే లో ఉంటూ భారత ప్రధాని, భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ లోని పంజాబ్ రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక ఖలిస్తాన్ అనే దేశంగా మార్చాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ సహాయపడుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాదులకు పాకిస్తాన్ లోని లాహోర్ లో ఆశ్రయం కల్పిస్తోంది.