ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ 32వ మ్యాచ్ లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ బుధవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ముందుగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. 6 మ్యాచులు ఆడగా అందులో మూడు మ్యాచులలో విజయం సాధించి మూడు మ్యాచులలో ఓటమిపాలయ్యింది. ఇక చివరిగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడి విజయం…
IPL 2022 మెగా సీజన్ లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా IPL టైటిల్ ను గెలుచుకుంది. తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హార్డిక్ పాండ్యా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. భారత వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఈ సీజన్ లో అదరగొట్టాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అతడిని…
ఐపీఎల్ 2022 లో ఛాంపియన్స్ గా నిలిచిన గుజరాత్ జట్టు ను ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ఘనంగా సత్కరించారు. ఆదివారం రాజస్థాన్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది . ఈ గెలుపు నేపథ్యంలో గుజరాత్ జట్టు ఆటగాళ్లు సోమవారం ఆ జట్టు ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఓపెన్ టాప్ బస్‌పై ఊరేగిన గుజరాత్ ఆటగాళ్లకు అభిమానులు జేజేలు పలికారు.…
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతితో రాజస్థాన్ రాయల్స్ భంగపాటుకు గురైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ సంజు శాంసన్ ఇదే తప్పు చేశాడు. ఫైనల్లో కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంపై విమర్శలు చెలరేగాయి. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సంజు శాంసన్ వివరించాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు…
ఈ సీజన్ ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్‌గా గుజరాత్ టైటాన్స్ ఆవిర్భవించింది. లీగ్‌లోకి అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే కప్పు అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ విధించిన 131 పరుగుల టార్గెట్‌ను సులభంగా ఛేదించింది. శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్), హార్దిక్ పాండ్యా (34), మిల్లర్ (32 నాటౌట్) రాణించడంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలుపొందింది. రాజస్థాన్…
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ ముందు రాజస్థాన్ తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ కుప్పకూలింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ 39, జైశ్వాల్ 22 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, సాయి…
ఐపీఎల్ 2022 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తుది జట్ల వివరాలు: రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మెయిర్,…
ఐపీఎల్ 2022 తుది దశకు చేరుకుంది. ఆదివారం రాత్రికి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. అయితే ఐపీఎల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజేతకు అక్షరాలా రూ.20కోట్లు అందనున్నాయి. రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.13కోట్లు దక్కించుకోనుంది. అటు మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రైజ్ మనీగా రూ.7కోట్లు అందనున్నాయి. మరోవైపు 4వ స్థానంలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్…
ఐపీఎల్ 2022 తొలి క్వాలిఫయర్ క్రికెట్ అభిమానులకు మంచి మజా అందించింది. ఆడేది తొలి ఐపీఎల్ సీజన్ అయినా ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ ఐపీఎల్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. 189 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ సాహా డకౌట్ కాగా శుభ్‌మన్ గిల్(35), మాథ్యూ వేడ్(35)…