ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఈ ఏడాది కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంకో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఐపీఎల్‌లో ఈ రెండు కొత్త జట్లు తలపడుతున్న వేళ…
ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో అమ్ముడుపోని సురేష్ రైనాకు ఊరట లభించనుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ దూరమయ్యాడు. అతడిని వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు దక్కించుకుంది. ఇప్పుడు అతడు దూరం కావడంతో మరో ఆటగాడితో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు క్రికెట్ విశ్లేషకులు ఓ సలహా ఇస్తున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్న సురేష్ రైనాను…
మరో 25 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే మెగా లీగ్ ఆరంభానికి ముందే కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్‌కు షాక్ తగిలింది. భారీ అంచనాలతో కొనుగోలు చేసిన స్టార్ ఓపెనర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. చాలా కాలంగా కరోనా కారణంగా బయోబబుల్‌లో గడుపుతున్నానని, దీంతో ఒత్తిడి పెరిగిందని.. అందుకే ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు రాయ్ తెలిపాడు. అయితే రాయ్ తప్పుకోవడంతో గుజరాత్ జట్టుకు ఓపెనర్ సమస్య మొదలుకానుంది.…