ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ 32వ మ్యాచ్ లో ఏప్రిల్ 17న గుజరాత్ టైటాన్స్ బుధవారం, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది. ఇక ఈ సీజన్ లో ముందుగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. 6 మ్యాచులు ఆడగా అందులో మూడు మ్యాచులలో విజయం సాధించి మూడు మ్యాచులలో ఓటమిపాలయ్యింది. ఇక చివరిగా జరిగిన రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ చివరి వరకు పోరాడి విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. దీంతో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ పాయింట్స్ పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆరో మ్యాచులలో నాలుగు మ్యాచులు ఓడిపోయి కేవలం రెండు మ్యాచులలో మాత్రమే గెలుపొందింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్ లో లక్నో సొంతవేదికలో ఓడించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్లో ఆడనుంది. ఇక పాయింట్స్ టేబుల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 9వ స్థానంలో కొనసాగుతుంది.
Also Read: Jharkhand : జార్ఖండ్‌లో త్రిపుల్ మర్డర్.. భార్య, బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి
ఇక ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మొత్తం మూడు మ్యాచ్లు ఆడగా.. అందులో గుజరాత్ టైటాన్స్ రెండుసార్లు విజయం సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.
ఇక నేడు ఆడబోయే మ్యాచ్ కు ప్లేయింగ్ 11 ఈ విధంగా అంచనా వేయవచ్చు. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాబబుల్ XI జట్టును చూస్తే.. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే, ఇషాంత్ శర్మ గా ఉండవచ్చు.
Also Read: Mamitha Baiju : ఐశ్వర్య రాయ్ పాటకు మమితా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూశారా?
ఇక గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XI జట్టును చూస్తే.. శుభమన్ గిల్ (c), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్ (WK), రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ గా ఉండవచ్చు.