ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ ముందు రాజస్థాన్ తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేసింది. గుజరాత్ బౌలర్ల దెబ్బకు రాజస్థాన్ కుప్పకూలింది. దీంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బట్లర్ 39, జైశ్వాల్ 22 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో హార్డిక్ పాండ్యా 3 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు, రషీద్ ఖాన్, యష్ దయాల్, షమీ చెరో వికెట్ పడగొట్టారు.