ఐపీఎల్ 2022 విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్ల వివరాలు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్‌మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్.
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్డిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఫెర్గూసన్, యశ్ దయాల్, షమీ