ఐపీఎల్ 2022 తుది దశకు చేరుకుంది. ఆదివారం రాత్రికి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. అయితే ఐపీఎల్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీపై సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. విజేతకు అక్షరాలా రూ.20కోట్లు అందనున్నాయి. రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.13కోట్లు దక్కించుకోనుంది. అటు మూడో స్థానంలో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రైజ్ మనీగా రూ.7కోట్లు అందనున్నాయి. మరోవైపు 4వ స్థానంలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.
IPL 2022: ముస్తాబైన అహ్మదాబాద్ స్టేడియం.. స్పెషల్ గెస్ట్ ఎవరంటే?
అంతేకాకుండా ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌కు రూ.15 లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ నిలిచాడు. అతడు 16 మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీల సహాయంతో 824 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ అందనుంది. పర్పుల్ క్యాప్ విన్నర్ కూడా రూ.15 లక్షల నగదు అందనుంది. పర్పుల్ క్యాప్ రేసులో బెంగళూరు బౌలర్ హసరంగ, రాజస్థాన్ బౌలర్ చాహల్ ఉన్నారు. మరోవైపు వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీ పెంచాలని బీసీసీఐ యోచిస్తోంది.