IPL 2022 మెగా సీజన్ లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ ఎవ్వరూ ఊహించని విధంగా IPL టైటిల్ ను గెలుచుకుంది. తొలిసారి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన హార్డిక్ పాండ్యా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు.
భారత వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ కూడా ఈ సీజన్ లో అదరగొట్టాడు. గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అతడిని వేలంలో రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. తనపై గుజరాత్ టైటాన్స్ పెట్టుయికున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తన అద్భుత బౌలింగ్ తో న్యాయం చేశాడు. షమీ ఆడిన 16 మ్యాచ్ ల్లో ఏకంగా 20 వికెట్లు తీసి టైటిల్ ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే ఈ సీజన్ లో షమీ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్ లో తొలి బంతికి అలాగే ఆఖరి బంతికి వికెట్ తీసిన తొలి ప్లేయర్ గా షమీ నిలిచాడు. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడగా తన తొలి బంతికే కేఎల్ రాహుల్ ను అవుట్ చేసిన షమీ… ఫైనల్లో 20వ ఓవర్ వేసి రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో సీజన్ తొలి, చివరి బంతులకు వికెట్లు తీసిన ప్లేయర్ గా షమీ సరికొత్త రికార్డును నెలకొల్పాడు.