తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న బిపర్‌జోయ్ తుఫాన్.. తీరం దాటక ముందే తుఫాన్ ధాటికి గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాన్ని భారీ వర్షాలు.. ఇప్పటికే తీరప్రాంతలు, తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 74వేల మందికిపైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు.. కచ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో ఇవాళ సాయంత్రం తీరం దాటనున్న బిపర్ జోయ్ తుఫాన్.
Earthquake: గుజరాత్ కచ్ ప్రాంతంలో ఈ రోజు భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చింది. వరసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి.
Heat Wave: అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాన్ ‘బిపార్జాయ్’ గుజరాత్ తీరంపై విరుచుకుపడేందుకు చూస్తోంది. రేపు గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. గుజరాత్ తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ గోవాల రాష్ట్రాలతో పాటు డామన్ డయ్యూ, లక్షద్వీప్, దాద్రానగర్ హావేలీ కేంద్ర పాలిత ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించింది భారతవాతావరణ శాఖ(ఐఎండీ).
అరేబియా మహాసముద్రంలో బిపర్‌జోయ్ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిని ‘బిపార్జాయ్’ తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధం అవతోంది. ఈ నెల 15న గుజరాత్ తీరాన్ని తుఫాన్ తాకే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా తుఫాన్ గుజరాత్ తీరంపై విరుచుకుపడనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పలు జిల్లాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో చేపలవేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.
బిపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. ప్రస్తుతం గుజరాత్ లోని పోర్ బందర్‌కు నైరుతి దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. జూన్ 15 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పశ్చిమ రైల్వే నేడు (మంగళవారం) 67 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొనింది.
Cyclone Biparjoy: రానున్న 24 గంటల్లో బిపర్ జోయ్ తుపాను మరింత ప్రమాదకరంగా మారుతుందని అంచనా. అరేబియా సముద్రం నుంచి ఉద్భవించిన తుపాను నెమ్మదిగా ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది.
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
Gujarat: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) మాడ్యూల్‌ను గుజరాత్ ఏటీఎస్ ఛేదించింది. పోర్ బండర్, సూరత్ ప్రాంతాల్లో మూడు చోట్ల ఆపరేషన్ నిర్వహించి ఒక మహిళతో సహా నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.