Earthquake: గుజరాత్ కచ్ ప్రాంతంలో ఈ రోజు భూకంపం సంభవించింది. కచ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రంతో భూకంపం వచ్చింది. వరసగా రెండు రోజులుగా దేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం జమ్మూ కాశ్మీర్ లోని నాలుగు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. దోడా, కిష్ట్వార్ జిల్లాలో స్కూళ్లను మూసేశారు అధికారులు. కిష్ట్వార్ ప్రాంతంలో 3.3 తీవ్రతతో ఉదయం 8.29 గంటలకు భూకంప వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. దీనికి ముందు దోడాలో బుధవారం తెల్లవారుజామున 3.5 తీవ్రతతో, 4.3 తీవ్రతతో, దీనికి ముందు రియాసి జిల్లాలో 2.8 తీవ్రతతో తెల్లవారుజామున 2.43 గంటలకు భూకంపాలు వచ్చాయి.
Read Also: Ukraine War: యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు క్రిమినల్స్..
మరోవైపు బిపార్జాయ్ తుఫాన్ గుజరాత్ వణికిస్తున్న క్రమంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. అరేబియా సముద్రంలో పెను తుఫానుగా మారిని బిపార్జాయ్ గురువారం సాయంత్రం గుజరాత్, పాకిస్తాన్ మధ్య తీరాన్ని దాటనుంది. జూన్ 16-18 వరకు గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గంటకు 130-150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది.