బిపర్‌జోయ్ తుఫాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడనుంది. తీరం దాటక ముందే తుఫాన్ ధాటికి గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర–కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తీరప్రాంతలు, తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో 74వేల మందికిపైగా స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్, ద్వారక, జామ్‌నగర్‌లో కుంబవృష్టి వర్షం ఖాయమని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Read : Law cet Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, పోరుబందర్, రాజ్‌కోట్ జిల్లాల్లో బుధవారం 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసింది. ఒకటి రెండు చోట్ల ఏకంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అరేబియా సముద్రంలో తుఫాన్ కేంద్రబిందువు కాస్తంత దిశ మార్చుకుని ఈశాన్యం వైపుగా కదులుతూ కచ్, సౌరాష్ట్రల మధ్య జఖౌ పోర్ట్ సమీపంలో ఇవాళ (గురువారం) సాయంత్రం తీరం దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తీరం వెంట ఉన్న 8 రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.
Also Read : Adipurush 1st Day Collections: ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. క్రేజ్ మాములుగా లేదుగా!
పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్‌సహా ఇతర సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెడర్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. తీరం దాటేటపుడు గంటకు 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తుఫాన్ ఊహించని రీతిలో ఉంటే దానికి తగ్గ సహాయక కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని త్రివిధ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు.
Also Read : Sri Sai Chalisa: శ్రీ సాయి చాలీసా వింటే సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది
ప్రస్తుతం తుఫాన్ కేంద్రబిందువు కచ్ తీరానికి 290 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 18, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు 12, రోడ్డు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు, విద్యుత్ శాఖకు చెందిన దాదాపు 400 బృందాలను రంగంలోకి దింపామని స్టేట్ రిలీఫ్ కమిషనర్ చెప్పారు. మరోవైపు సిబ్బంది సన్నద్దతపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సీఎం భూపేంద్ర పటేల్ తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. తీరానికి దూరంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలను సహాయక శిబిరాలుగా మార్చారు. ఆహారం, తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించారు.
Also Read : Kolkata Airport: కోల్‌కతా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాల్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. భుజ్ చేరుకొని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సైతం తుఫాన్ వేళ వైద్యసేవలపై సమీక్ష జరిపారు. తుఫాన్ గుజరాత్, పాకిస్తాన్ తీరాల వైపు దూసుకొస్తోంది. జఖౌ పోర్టు సమీపంలో తీరాన్ని దాటి జనావాసాలపై పెనుప్రతాపం చూపనుంది.