'బిపర్‌జోయ్' తుఫాను ఉత్తర దిశగా పయనిస్తూ గుజరాత్‌లోని పోర్‌బందర్ జిల్లాకు దక్షిణ-నైరుతి దిశలో 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నందున, మత్స్యకారులు లోతైన సముద్ర ప్రాంతాలు, ఓడరేవుల నుంచి తీరానికి తిరిగి రావాలని సుదూర హెచ్చరిక సిగ్నల్ ఎగురవేయాలని సూచించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ప్రధాని మోడీ తన చిన్నతనంలో ఏం చేశాడంటే అందరికీ తెలిసిన విషయమే.. తన నాన్నకు సహాయంగా ఆయన కూడా టీ అమ్మారు. ఆ ప్రాంతం ఎక్కడనుకుంటున్నారా..? గుజరాత్ రాష్ట్రంలోని వాద్ నగర్. ఆ ప్రాంతాన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మస్థలమైన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో బుధవారం పర్యటించారు.
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. అతని మంచి డ్రెస్సింగ్ సెన్స్ మరియు సన్ గ్లాసెస్ చూసి కోపోద్రిక్తులైన అగ్రవర్ణ వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.
Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు.
Gujarat : పెళ్లయ్యాక ఆ అమ్మాయి నమ్మకంతో భర్త ఇంటికి వస్తుంది. ఆమె తన భర్తపై ఎలాంటి ప్రేమను చూపిస్తోందో అలానే తన భర్త నుంచి ఆశిస్తుంది. పెద్దలు కుదిర్చిన వివాహం కంటే ప్రేమ పెళ్లిలో వీరి మధ్య నమ్మకం మరీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు భాగస్వామి గురించి ముందే తెలుసు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ గ్రౌండ్ లో వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో గ్రౌండ్ సిబ్బంది హెయిర్ డ్రయ్యర్లు, స్పాంజీలు ఉపయోగించారు. పేరుకేమో ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు.. కానీ పరిస్థితేమో ఇలా ఉంది అంటూ నెటిజన్లు బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ 16లో భాగంగా రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించి చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Visa ban: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వారికి ఆష్ర్టేలియా షాకిచ్చింది. ఇండియాలోని కొన్ని రాష్ర్టాలకు చెందిన విద్యార్థులకు వీసా ఇవ్వడానికి నిరాకరించింది. ఆష్ర్టేలియాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ఇండియా విద్యార్థులకు వీసా ఇవ్వొద్దని నిర్ణయించుకున్నాయి. ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆయా రాష్ర్టాలకు చెందిన విద్యార్థుల నుంచి వీసా దరఖాస్తులను స్వీకరించవద్దని ఫెడరేషన్ యూనివరి్సటీ,…