గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన స్మిత్ చాంగెలా చిన్నప్పటి నుంచి న్యూరోపతితో బాధపడుతున్నాడు. అయితే, ముక్కుతో ఫోన్ లో టైప్ చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే తపన ఉంటే వైకల్యం ఎన్నటికీ అడ్డురాదని స్మిత్ నిరూపించాడు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఇవాళ (ఆదివారం) అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి.
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల బిల్డింగ్ కూలిపోయింది. దీంతో ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో.. బిల్డింగ్ పాతది కావడంతో కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది.
గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో మొత్తం 11 మంది దోషులకు గత సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై బానో నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వరుస పిటిషన్‌లపై సుప్రీంకోర్టు తుది విచారణను ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది.
ఒక దగ్గర ఒక గుడి ఉంటుంది.. లేదంటే రెండు గుళ్లు ఉంటాయి.. ఇంకా అంటే మూడు గుళ్లు ఉంటాయి.. కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే దగ్గర ఉన్న ప్రాంతం ఎక్కడా చూశారా? అదేంటీ.. అటువంటి ఒక ప్రాంతం ఉందా? అనే అనుమానం కలుగుతుందా? ఇది నిజం.
Gujarat: గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ గృహహింస కింద భర్తను అరెస్ట్ చేయించి, తానే బెయిల్ ఇప్పిస్తూ వస్తోంది. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 10 ఏళ్లలో తన భర్తను 7 సార్లు అరెస్ట్ చేయింది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ గా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు రూ. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారుల బృందం సీజ్ చేసింది. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లుగా మార్చి తరలించేందుకు ఓ కేటుగాడు ప్రయత్నం చేశాడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా డీఆర్ఐ అధికారుల బృందం సూరత్ ఎయిర్ పోర్ట్ లో మాటు వేసింది. దుబాయ్ ప్రయాణీకుడి…