Gujarat: గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న ఒక దర్గాకు మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దర్గాను అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేతకు నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్న మున్సిపల్ అధికారులు.. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దర్గా నిర్వహకులకు సూచించారు. దర్గా కూల్చివేతకు నోటీసులు ఇవ్వడానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులతోపాటు దర్గా దగ్గరకు రావడంతో దర్గాను కూల్చివేయడానికి వచ్చారని భావించిన ఒక వర్గానికి చెందిన ప్రజలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఎర్పడ్డాయి.
Read also: Donald Trump: ట్రంప్ మామ ఏంటి ఇది? ఇష్టమొచ్చినంత తినమన్నాడు.. బిల్లు టైంకు జారుకున్నాడు..!
గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో నిర్మించిన దర్గా అక్రమంగా నిర్మించారని అందుకే కూల్చివేత నోటీసును ఇస్తున్నట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం దర్గా నిర్వహాకులకు తెలిపింది. అందుకు సంబంధించిన నోటీసులను దర్గా వెలుపల అంటించడానికి అధికారులు వచ్చారు. పోలీసులతో పాటు మున్సిపల్ శాఖ అదికారులు రావడంతో దర్గా కూల్చివేతకు వచ్చరని భావించిన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు సుమారు 200-300 మంది ప్రజలు దర్గా చుట్టూ గుమిగూడారు. దర్గా వెలుపల కూల్చివేత నోటీసును ఉంచడానికి జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మజేవాడి గేట్ ముందు చేరుకున్నారు. మతపరమైన నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారని నోటీసులో పేర్కొంది.
Read also: MP Mopidevi Venkataramana: వైసీపీ ఎంపీకి నిరసన సెగ..
దర్గాను చట్టబద్ధంగా నిర్మించారా? లేదా? అనేది స్పష్టం చేయాలని అధికారులు దర్గా నిర్వహకులను ప్రశ్నించింది. అనుమతి లేకుండా నిర్మిస్తే లేకుంటే కూల్చివేస్తామని.. అందుకు అయ్యే ఖర్చును నిర్వాహకులు భరించాలని పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించి ఐదు రోజులలోగా ఆధారాలు సమర్పించాలని అధికారులు గడువు ఇచ్చారు. ఈ నోటీసు కలకలం సృష్టించింది. దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న ప్రజలు కేకలు వేయడం, పోలీసు వాహానాలపై, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు పోస్ట్‌ను ధ్వంసం చేశారు మరియు పోలీసు వాహనాలకు కూడా నిప్పు పెట్టారు.హింస చెలరేగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌తో సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.